జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలో..
- August 21, 2016
స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలోని లోనవాలలో కొత్తగా తయారీ యూనిట్ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలకు దాదాపు ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నెలకొల్పనుంది. ప్రస్తుతం సంస్థ నెలకు 3-3.5 లక్షల ఫీచర్ మొబైళ్లను విక్రయిస్తోంది. దీపావళి లోగా అమ్మకాలు నెలకు 6 లక్షలకు చేరుకుంటాయని సంస్థ భావిస్తోంది. డిమాండ్ ప్రకారం 2017-18 లోగా నెలకు 10 లక్షల వరకు అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే లొనవాలలో రూ.180-200 కోట్లతో తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు సంస్థ సీఈవో పంకజ్ ఆనంద్ తెలిపారు. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఒక ఫీచర్ ఫోనును తమ వద్ద ఉంచుకుంటున్నారని దీన్ని బట్టి భవిష్యత్తులో గిరాకీ తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









