‘ఓ నా సిద్ధయ్య’.. త్వరలో రాబోతున్న సాంగ్..
- September 18, 2026
సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన జంటగా నటించిన ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రామ్ అద్నాన్ ఈ పాటను రాసి తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను పాడారు. నేడు కందకట్ల క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ కి సంబంధించి టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చంద్రబోస్, కాసర్ల శ్యాం, నల్గొండ గద్దర్, గీతా భాస్కర్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. నా సోదరుడు సిద్ధు రెడ్డి ‘ఓ నా సిద్ధయ్య’ పాటను చేయడం ఆనందంగా ఉంది. సిద్ధురెడ్డి ప్రభుత్వ పాఠశాల్ని నిర్మించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. మూడు వందల మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. అలాంటి మంచి మనిషి చేసిన ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ.. సిద్ధుతో ఆరేడు నెలల పరిచయమే అయినా ఆరేడు జన్మల బంధం అనిపిస్తోంది. సిద్ధు కోసం నేను కూడా ఓ మంచి పాట రాశాను. అది కూడా త్వరలో రాబోతోంది. ఈ పాటలో సిద్ధు బాగా నటించాడు. సిద్ధు చేసే సేవా కార్యక్రమాల గురించి వింటూ ఉన్నాను అని తెలిపారు.
కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ఒక్క పూట పరిచయంతోనే సిద్ధు సోదరుడుతో ఆనుబంధం ఏర్పడింది. రాము ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించాడు. ఓ నా సిద్ధయ్య పాట సిద్ధు భయ్యాని ఓ మెట్టు పైకి ఎక్కించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. సిద్ధు రెడ్డి మాట్లాడుతూ.. రామ్, లక్ష్మణ్ పాటలు ఖండాంతరాలు దాటాయి. వారు పాడే పాటలు, రాసే అక్షరాలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. మూడు వందల మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది. నా భర్త హాస్పిటల్లో ఉన్నాడని ఓ మహిళ ఫోన్ చేసింది. నా వంతుగా ఆర్థిక సాయం చేశాను కానీ హాస్పిటల్ బిల్ మాత్రం ఐదు లక్షల వరకు వెళ్లింది. అప్పుడు నాకు ఈ ఇన్సూరెన్స్ గురించి ఆలోచన వచ్చింది. ఇది కేవలం సాంగ్లా కాకుండా సినిమాని చేసిన ఫీలింగ్ కలిగింది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తాం అని తెలిపారు.
రామ్ అద్నాన్ మాట్లాడుతూ.. సిద్ధు రెడ్డి అన్న కథనే ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశాం. ఇది కేవలం పాటలా అనిపించలేదు. ఓ పెద్ద సినిమాని చేసిన ఫీలింగ్ కలిగింది. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, భార్యాభర్తల బంధం అన్నీ చూపించాం. ఈ పాట అందరి ఇళ్ళల్లో ఉంటుంది అని అన్నారు. గీతా భాస్కర్ మాట్లాడుతూ.. సిద్ధు రెడ్డితో నేను పని చేసింది తక్కువే. ఒక్క పూటే పని చేసినా ఎంతో తెలుసుకున్నా. అతను చేసే సేవా కార్యక్రమాలు తెలిసి నాలో కొత్త ఇన్‌స్పిరేషన్‌ను వచ్చింది అని అన్నారు.
తాజా వార్తలు
- ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం..కిటకిటలాడుతున్న క్యూలైన్లు!
- రష్యాపై ఆంక్షల బిల్లు పై ట్రంప్ సంతకం
- దుబాయ్‌లో Dh190,000 చోరీ..నిమిషాల్లోనే ముగ్గురు అరెస్ట్..!!
- కువైట్‌లో ఫైర్ఫోర్స్కు 8,282 అత్యవసర కాల్స్..!!
- అబుదాబి నుంచి రాస్ అల్ ఖైమాకు ఫ్లయింగ్ కార్..!!
- అంగోలా అధ్యక్షుడితో ఒమన్ సుల్తాన్ విందు భేటీ..!!
- ఇజ్రాయెల్ మీడియాలో తప్పుడు కథనాలను ఖండించిన ఖతార్..!!
- 41 దేశాలతో మల్టీనేషనల్ సముద్ర రక్షణ కూటమి..!!
- రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!
- పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..కొత్త రూల్స్ ఇవే







