గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ

- November 04, 2026 , by Maagulf
గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ

హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో అక్యూపెన్సీని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లపై రాయితీని ప్రకటించింది. టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ బీహెచ్ఈఎల్ డిపో పరిధిలో దూర ప్రాంతాల్లకు వెళ్లే బస్సుల్లో రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్ఎం శ్రీదేవి ప్రకటించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు, వైసూరు, విజయవాడ, గుంటూరు వెళ్లే వారికి లబ్ధి చేకూరనుంది. బీహెచ్ఈఎల్ నుంచి ఈ మార్గాల్లో నడిచే బస్సుల్లో మాత్రమే రాయితీ వర్తించనుంది. బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ రాజధాని బస్సు ఛార్జీ రూ.600 ఉండగా.. దాన్ని రూ.500 తగ్గించారు. అంటే రూ.100 డిస్కౌంట్ ప్రకటించారు.

ఒక్కో టికెట్ పై రూ.620 తగ్గించారు
హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రూ.530 నుంచి రూ.450 తగ్గించారు. అంటే రూ.80 తగ్గించారు. హైదరాబాద్ నుంచి మైసూరు స్లీపర్ బస్సు ఛార్జీ రూ.2,420గా ఉండగా.. టికెట్ ధరను రూ.1800 లకు తగ్గించారు. అంటే ఒక్కో టికెట్ పై రూ.620 తగ్గించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏసీ స్లీపర్ బస్సుల్లో ఛార్జీ రూ.1440 ఉండగా దాన్ని రూ.1200 తగ్గించారు. అంటే ఒక్కో టికెట్ పై రూ.240 తగ్గించారు. అయితే ఈ ఛార్జీలు బీహెచ్ఈఎల్ నుంచి బయల్దేరే బస్సుల్లో మాత్రమే ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com