కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!

- November 04, 2026 , by Maagulf
కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!

కువైట్: కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది భారతీయ మహిళా నర్సులు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఫర్వానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది కేరళకు చెందినవారని సమాచారం.వివరాల్లోకి వెళ్తే.. ఫర్వానియా ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు అబ్బాసియా నుంచి నర్సులను తీసుకెళ్తున్న ప్రైవేట్ రవాణా వ్యాన్ మంగళవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో అబ్బాసియా ఫైర్ స్టేషన్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో 11 మంది నర్సులు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో నర్సుకు చేతికి తీవ్ర గాయమైంది. అయితే ఆమె ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి వైద్య చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఫర్వానియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులెవరనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com