బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- November 04, 2026
మనామా: బహ్రెయిన్‌లో గృహ విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపుల్లో నెలవారీ వ్యయాల హెచ్చుతగ్గులను నివారించేందుకు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా వినియోగదారులు ఏడాది పొడవునా ప్రతి నెలా ఒకే నిర్ణీత మొత్తాన్ని చెల్లించవచ్చు. గత 12 నెలల సగటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆధారంగా చేసుకుని నెలవారీ స్థిర చెల్లింపు మొత్తాన్ని EWA నిర్ణయిస్తుంది. అయితే ఈ విధానం వల్ల ప్రస్తుత విద్యుత్, నీటి టారిఫ్‌లలో ఎలాంటి మార్పు ఉండదు.
EWA, నార్తర్న్ మున్సిపల్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ పథకం వివరాలను వెల్లడించారు. EWA సబ్స్క్రైబర్స్ సర్వీసెస్ డైరెక్టర్ అహ్మద్ నజీబ్ అల్ జమియా మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీ పొందుతున్న తమ మొదటి ఇంటిలో నివసించే అర్హులైన బహ్రెయిన్ పౌరులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం మే నుంచి అక్టోబర్ వరకు గత కాలానికి కూడా వర్తించేలా నమోదు చేసుకోవచ్చు. అయితే కనీసం ఆరు నెలల బిల్లులు ఉండటం తప్పనిసరి. వాస్తవ బిల్లులకు, స్థిర నెలవారీ చెల్లింపులకు మధ్య ఏర్పడే వ్యత్యాసాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని భవిష్యత్తు బిల్లుల చెల్లింపులకు లేదా గతంలో బకాయి ఉన్న మొత్తాలను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకంలో నమోదు చేసుకోవడం సులభమని, బ్యాంకులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని అల్ జమియా స్పష్టం చేశారు. అంతేకాకుండా గత బకాయిలన్నీ ముందుగానే చెల్లించాలనే నిబంధన కూడా లేదని తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన వినియోగదారులు EWA అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!
- యూఏఈలో వింటర్ హాలిడేస్.. చివరి నిమిషంలో ట్రిప్‌లకు పెరుగుతున్న డిమాండ్..!!
- వాట్సాప్ సిమ్ బైండింగ్ నిబంధనలు..
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!







