బర్కా విలాయత్‌లో 23 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

- September 21, 2026 , by Maagulf
బర్కా విలాయత్‌లో 23 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 23 మంది ఆసియా దేశస్థులను అధికారులు అరెస్ట్ చేశారు. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని బర్కా విలాయత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని తీసుకువెళ్తున్న ఓ పడవను కోస్టల్ గార్డ్ పోలీస్ యూనిట్ గుర్తించి అదుపులోకి తీసుకుంది. అరెస్టు చేసిన వారిపై ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com