దుబాయ్‌లో Dh6.5 మిలియన్ల హెల్త్ ఎండోమెంట్ ప్రారంభం..!!
- September 21, 2026
దుబాయ్: అవసరమైన రోగుల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించేందుకు దుబాయ్‌లో Dh6.5 మిలియన్ల విలువైన ‘వక్ఫ్ తదావీ’ ఆరోగ్య ఎండోమెంట్‌ను ప్రారంభించారు. దుబాయ్‌లోని ఎండోమెంట్ అండ్ మైనర్స్ ట్రస్ట్ ఫౌండేషన్ అవ్‌కాఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో అల్ సత్వా ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆదాయం తక్కువగా ఉన్నవారు, చికిత్స ఖర్చులు భరించలేని రోగులకు జాతీయతతో సంబంధం లేకుండా వైద్య సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు.
అవ్‌కాఫ్ దుబాయ్, అల్ తదావీ హెల్త్‌కేర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. వక్ఫ్ ఆస్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని అవసరమైన రోగుల చికిత్స ఖర్చులను భరించేందుకు వినియోగించనున్నారు.సుమారు 2,515 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మూడు నివాస అంతస్తులతో పాటు రిటైల్ దుకాణాలు, వివిధ సేవా సదుపాయాలు ఉన్నాయి. సుమారు Dh6.5 మిలియన్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం నిరుపేద రోగుల వైద్య ఖర్చులకు ఉపయోగపడనుంది.
దుబాయ్ పోలీస్, పబ్లిక్ సెక్యూరిటీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధాహి ఖల్ఫాన్ తమీమ్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలోని వక్ఫ్ కార్యక్రమాలు ప్రజలపై పెట్టే సుస్థిర పెట్టుబడిగా అభివర్ణించారు.‘వక్ఫ్ తదావీ’ ఎమిరేటీ సమాజంలోని సహకారం, కరుణ వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని, దానధర్మాన్ని నిరంతరం ప్రయోజనం చేకూర్చే స్థిరమైన వనరుగా మార్చుతుందని అన్నారు. అవసరమైన రోగుల బాధలను తగ్గించేందుకు, వారికి వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అవ్‌కాఫ్ దుబాయ్ బోర్డు చైర్మన్ ఈసా అబ్దుల్లా అల్ ఘురైర్ మాట్లాడుతూ.. సమాజ అవసరాలను తీర్చే సుస్థిర వక్ఫ్ కార్యక్రమాల అభివృద్ధికి దుబాయ్ కట్టుబడి ఉందని తెలిపారు.చికిత్స ఖర్చులు భరించలేని రోగులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు అవసరమైన వైద్యం అందేలా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. వక్ఫ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మానవతా సేవలకు మళ్లించడం ద్వారా అవసరమైన వారికి సహాయం అందించడమే కాకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కూడా ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ అహ్సాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సహా 9 మంది మృతి..!!
- ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు..!!
- బర్కా విలాయత్‌లో 23 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- దుబాయ్‌లో Dh6.5 మిలియన్ల హెల్త్ ఎండోమెంట్ ప్రారంభం..!!
- కువైట్‌లో ఆర్థిక కోర్టులతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగే అవకాశం..!!
- యూఏఈలో భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక ఆదివారం కూడా పాస్‌పోర్టుల కలెక్షన్
- డైవింగ్ భద్రతపై కోస్ట్‌గార్డ్ సూచనలు..!!
- రెండు వారాల్లో సాధారణ స్థాయికి ఖతార్ ఎల్ఎన్జీ సామర్థ్యం..!!
- ఇండస్ట్రియల్ భద్రత కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్, ఆపరేషన్స్ సెంటర్..!!
- ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన షూటర్లు.. భారత్‌కు మరో రజతం







