భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- September 21, 2026
దుబాయ్: భారత్-యూఏఈ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డి, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జెయౌదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఇరు దేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యాలను విస్తరించడం వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు.
భారత్-యూఏఈ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడంలో నిరంతరం మద్దతు అందిస్తున్న మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జెయౌదీకి డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాల పై నిరంతరంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా వార్తలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!
- బహ్రెయిన్‌లో పౌరసంఘాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!







