తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- September 22, 2026
న్యూయార్క్: న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (UN General Assembly) సర్వసభ్య సమావేశం సందర్భంగా ‘పార్ట్నర్స్ ఫర్ మల్టీలేటరలిజం’ (Partners for Multilateralism) సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడారు. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు మరియు నిరంతర సంఘర్షణల వల్ల ప్రస్తుత ప్రపంచ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాల్లో ఏకపక్ష ధోరణులు పెరగకుండా, అనేక దేశాలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునే ‘బహుళపక్ష విధానం’ (Multilateralism) మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు తక్షణ సంస్కరణలు అవసరమని జైశంకర్ స్పష్టం చేశారు. ఐరాసలో ఆయన ప్రసంగించిన సారాంశం: గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో పునఃసమతుల్యత జరుగుతోందని, అయితే తీవ్రమైన పోటీ మరియు ప్రాంతీయ యుద్ధాలు ఈ మార్పులను వినాశకర దిశగా తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.ఇంధనం (Fuel), ఆహారం (Food), ఎరువులు (Fertilizers), ఆర్థికం (Finance) – అనే నాలుగు అత్యంత కీలక రంగాల్లో ఎదురవుతున్న ‘4F’ సంక్షోభాలను ఏ దేశం కూడా ఒంటరిగా పరిష్కరించలేదని, వీటిపై అంతర్జాతీయ సమాజం వెంటనే దృష్టి సారించాలన్నారు. గ్లోబల్ సప్లై చైన్‌లలోని లోపాలను సవరించడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతికతలను సరైన రీతిలో వినియోగించుకోవడానికి సార్వత్రిక నిబంధనలు అవసరమని గుర్తుచేశారు.
ఈయూ (EU) నేతలతో భేటీ మరియు ప్రపంచ పరిణామాలు
న్యూయార్క్ పర్యటనలో భాగంగా జైశంకర్ యూరోపియన్ యూనియన్ (EU) సహచర విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. భారత్-ఈయూ సంబంధాల పురోగతితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాలు మరియు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై విసృతంగా చర్చించారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో భారతదేశం నిబద్ధతతో కూడిన భాగస్వామిగా ఉంటుందని స్పష్టం చేశారు. హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాల సమాహారమైన ‘విసెగ్రాడ్ 4’ (V4) కూటమి విదేశాంగ మంత్రులతో విదేశాంగ మంత్రి జైశంకర్ తొలిసారిగా సమావేశమయ్యారు.భారత్ – V4 దేశాల మధ్య వ్యాపారాన్ని పెంపొందించేందుకు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక ‘వార్షిక వ్యాపార వేదిక’ (Annual Business Forum) ఏర్పాటు చేయడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోండి
తాజా వార్తలు
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!







