కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- September 22, 2026
కువైట్:** కువైట్‌లో కొత్తగా 7 వాణిజ్య కార్యకలాపాలను ప్రవేశపెట్టారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణకు సంబంధించిన యూనిఫైడ్ గైడ్ లైన్స్ కింద ఈ కొత్త కార్యకలాపాలను చేర్చినట్లు ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల శాఖ మంత్రి, వాణిజ్య–పరిశ్రమల శాఖ తాత్కాలిక మంత్రి అబ్దులఅజీజ్ అల్ మార్జూక్ ప్రకటించారు.
కొత్తగా 7 కార్యకలాపాలు
2026లో జారీ చేసిన మంత్రిత్వ శాఖ తీర్మానం నంబర్ 184 ప్రకారం కింది కార్యకలాపాలకు ఆమోదం లభించింది:
* సీ ట్యాక్సీ సేవలు
* సముద్ర క్రీడలు, శిక్షణ కార్యకలాపాలు
* సముద్ర మార్గంలో వినియోగదారుల ఆర్డర్ల విక్రయం, డెలివరీ
* తేలియాడే వినోద కార్యకలాపాలు
* సముద్ర ప్రాంతాల్లో ప్రకటనల ప్రదర్శన సేవలు
* సాధారణ సముద్ర మరమ్మతులు, నిర్వహణ సేవలు
* అల్యూమినియం, టెన్షన్డ్ ఫ్యాబ్రిక్‌తో ఆటోమేటెడ్ మూవబుల్ షేడింగ్ సిస్టమ్స్ తయారీ
పర్యవేక్షణ బాధ్యతలు
కొత్తగా ప్రవేశపెట్టిన కార్యకలాపాల్లో 6 సముద్ర సంబంధిత కార్యకలాపాలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షించనుంది. అల్యూమినియం, టెన్షన్డ్ ఫ్యాబ్రిక్‌తో ఆటోమేటెడ్ మూవబుల్ షేడింగ్ సిస్టమ్స్ తయారీ కార్యకలాపాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ పర్యవేక్షిస్తుంది. ఈ నిర్ణయం జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలో దీనిని అధికారిక గెజిట్‌లో ప్రచురించనున్నారు.
తాజా వార్తలు
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు







