యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- September 23, 2026
యూపీఐ లావాదేవీల పై విధించే ఎండీఆర్ ఛార్జీలకు సంబంధించి ఎన్పీసీఐ స్పందించింది. యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై విధించే GST చిన్న వ్యాపారులపై భారాన్ని మోపుతుందని, డిజిటల్ చెల్లింపులను ఖరీదైనవిగా మారుస్తుందని మీడియాలోని కొన్ని వర్గాలు చేసిన ఆరోపణలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఖండించింది. ఇది వాస్తవం కాదని స్పష్టం చేసింది. MDR అనేది కేవలం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన P2M (కస్టమర్ నుంచి వ్యాపారికి జరిగే) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. రూ. 2,000 వరకు జరిగే లావాదేవీలకు ఎండీఆర్ ఉండదని.. వాటిపై జీఎస్టీ ప్రభావం కూడా ఉండదని ఎన్పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎండీఆర్ పై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు
యూపీఐ ద్వారా వ్యాపారులకు జరిగే లావాదేవీల పరిమాణంలో రూ. 2,000 వరకు ఉండే లావాదేవీలే 96 శాతానికి పైగా ఉంటాయని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనివల్ల, అత్యధిక శాతం UPI చెల్లింపులకు MDR వర్తించదు. తద్వారా ఎండీఆర్ పై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలకు రూ. 1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు ఎండీఆర్ చెల్లించాల్సిందే. కాబట్టి వారికి ఎండీఆర్ పై జీఎస్టీ సమస్య కూడా ఉండదు. అందువల్ల MDRపై GST వ్యాపారులపై అదనపు భారాన్ని మోపుతుందనే ఆందోళనలు నిరాధారమైనవని ఎన్పీసీఐ పేర్కొంది. అత్యధిక శాతం UPI లావాదేవీలు, చిన్న వ్యాపారులు దీనివల్ల ప్రభావితం కారని వివరించింది.
తాజా వార్తలు
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!







