సోమాలియాలో ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి ..
- August 22, 2016
సోమాలియాలో రెండు వేరు వేరు చోట్లలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడుల్లో 17మంది మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల వివరణ ప్రకారం.. గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ గేటు వద్ద ఓ వ్యక్తి పేలుడుపదార్థాలు ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సమీపంలోని మార్కెట్ వద్ద మరో వ్యక్తి అలాంటి దాడికే పూనుకున్నాడు. ఒకే రోజు చోటు చేసుకున్న ఈ ఘటనల్లో పేలుళ్ల ధాటికి స్థానికులు 17మంది అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటనకు పూర్తి భాధ్యత వహిస్తున్నట్లు అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. ఈ విషయమై సోమాలియా ప్రధానమంత్రి ఒమర్ అబ్దిరషీద్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడులకు అమాయక ప్రజలు బలి కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం అందరికి శ్రేయస్కరం అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









