'జార్జ్ క్రిష్' లో హీరోయిన్ గా మానస వారణాసి- రేపు ఫస్ట్ బూస్టర్ రిలీజ్
- September 23, 2026
'నారీ నారీ నడుమ మురారీ', 'బైకర్' విజయాలతో జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్లతో తొలిసారిగా చేతులు కలిపారు. వీరి కాంబినేషన్ లో 'జార్జ్ క్రిష్' పండుగ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరించబోతోంది. ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. గతంలో విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో కలర్‌ఫుల్ ఫెస్టివ్ లుక్ ఆకట్టుకుంది. అందులో శర్వానంద్ హీరోయిన్ను ఎత్తుకున్న సిల్హౌట్ ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ తో సూపర్ హిట్ అందుకున్న మానస వారణాసి.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా కనిపించనున్నారు. టైటిల్ పోస్టర్‌ను బట్టి సినిమాలో లవ్ స్టోరీకి కీలక ప్రాధాన్యత ఉండబోతోంది. మానస పాత్ర కథలో కీలకంగా ఉండనుంది. ఫస్ట్ బూస్టర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి అటాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రైటింగ్ డిపార్ట్మెంట్లో భాగం కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మానస వారణాసి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: ATV
బ్యానర్: ఎకె ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత - రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాత - అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిషోర్ గరికిపాటి
DOP: KV గుహన్
సంగీతం: అనూప్ రూబెన్స్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
రైటర్స్: నందు సవిరిగాన, గోపీ మోహన్
మార్కెటింగ్: విశ్వ సీఎం
PRO: వంశీ - శేఖర్
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







