రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- September 24, 2026
రాస్ అల్ ఖైమా: విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి రోడ్డుపై చీపురు పట్టుకుని శుభ్రం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమా పోలీస్‌కు చెందిన అధికారి చేసిన ఈ చిన్న పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సుమారు 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు దాదాపు 8 లక్షల వ్యూస్ రావడంతో పాటు వేలాది లైకులు వచ్చాయి. వీడియోలో పోలీస్ అధికారి తన వాహనాన్ని రెడ్ సిగ్నల్ వద్ద ఆపి, హజార్డ్ లైట్లు ఆన్ చేసి.. చేతిలో చీపురు తీసుకుని రోడ్డుపై ఉన్న పెద్ద వస్తువులను పక్కకు తొలగిస్తూ కనిపించారు. రోడ్డుపై ఉన్న వస్తువులు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో.. రెడ్ సిగ్నల్ వద్ద లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికారి వాటిని తొలగించినట్లు తెలుస్తోంది.
యూఏఈలో రోడ్ల పరిశుభ్రత కోసం మున్సిపాలిటీలకు ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ.. ప్రజల భద్రత కోసం పోలీస్ అధికారి స్వయంగా ముందుకు రావడం నెటిజన్లను ఆకట్టుకుంది. మరో వ్యక్తి కూడా అధికారికి సహాయం చేస్తూ వీడియోలో కనిపించాడు. అయితే అతను పోలీస్ సిబ్బందికి చెందినవాడా, లేక స్వచ్ఛందంగా సహాయం చేసిన వ్యక్తా అన్నది స్పష్టంగా తెలియలేదు.
పోలీసుల సేవా స్ఫూర్తికి మరో ఉదాహరణ
యూఏఈలో పోలీసులు ప్రజల కోసం ముందుకు వచ్చిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. ఈ ఏడాది ప్రారంభంలో షార్జా పోలీస్‌కు చెందిన ఓ అధికారి భారీ వర్షాల కారణంగా నీటితో నిండిన రోడ్డులో నిలబడి ట్రాఫిక్‌ను నియంత్రించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ప్రమాదకర పరిస్థితుల్లో వాహనదారులు సురక్షితంగా వెళ్లేలా ఆయన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
అదేవిధంగా, దుబాయ్‌లోని ఓ పాఠశాల విద్యార్థిని పోలీస్ అధికారుల సేవలను అభినందిస్తూ చేతిరాతతో ఓ నోట్ అందించింది. దీనికి స్పందించిన దుబాయ్ పోలీస్‌లోని అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాఠశాలకు వెళ్లి ఆ విద్యార్థిని సత్కరించారు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆమెను అభినందించారు.
తాజా వార్తలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!
- ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
- బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!
- గల్ఫ్ భద్రతకు దౌత్యం, ప్రాంతీయ సహకారం అవసరం: ఖతార్
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!
- ఉమ్ అల్ ఖువైన్లో ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!







