బలోచిస్థాన్ నేతలపై కేసులు నమోదు..
- August 22, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ నేతలపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. బలోచిస్థాన్ స్వేచ్ఛా ఉద్యమానికి మోదీ ఇటీవల మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను అక్కడ ఉద్యమం చేస్తున్న నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో బలోచ్ వేర్పాటు వాద నేతలు బ్రహందగ్ బుగ్టి, హర్‌బియార్ మారి, బనుక్ కరిమాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు వీరిపై వేర్పాటువాదానికి సంబంధించి ఐదు కేసులు నమోదైనట్లు చెప్పారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బలోచిస్థాన్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









