12 ఏళ్ల కుర్రాడే ఆత్మాహుతి బాంబర్. ..!
- August 22, 2016
12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. 51 మందిని చంపాడు!ఇస్తాంబుల్ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్.. టర్కీలో ఉగ్రవాద దాడి చేసి, 51 మంది ప్రాణాలు బలిగొన్నాడు. ఓ పెళ్లిని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 69 మంది గాయపడ్డారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దాడికి పాల్పడింది 12 ఏళ్ల కుర్రాడేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిరియా- టర్కీ సరిహద్దుల్లోని ప్రాంతంలో ఈ దాడి జరిగింది. టర్కీలో ఈ ఏడాది జరిగిన ఉగ్రవాద దాడులన్నింటిలో ఇది అత్యంత దారుణమైనదని అంటున్నారు. ఈ దాడిని ప్రధానమంత్రి బినాలీ ఇల్డిరిమ్ ఖండించారు. పెళ్లి వేడుకను కాస్తా విషాద సమంగా మార్చేశాడని, ఇలాంటి దాడులను కఠినంగా అణిచేయాలని అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







