థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!

- September 27, 2026 , by Maagulf
థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!

దోహా: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో అక్కడ ఉన్న ఖతార్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని థాయ్‌లాండ్‌లోని ఖతార్ రాయబార కార్యాలయం సూచించింది. థాయ్‌లాండ్ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ ఎంబసీ ఈ సూచనలు చేసింది. భారీ వర్షాల కారణంగా నీటిమట్టాలు పెరగడంతోపాటు వరదలు, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా నదుల సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఖతార్ పౌరులకు ఎంబసీ సూచించింది. *అత్యవసర పరిస్థితుల్లో +66 622162222, +66 809305384, +66 615102679 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com