కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!

- September 27, 2026 , by Maagulf
కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!

కువైట్: కేవలం 13 ఏళ్ల వయసులోనే ఓ భారతీయ బాలిక రచయిత్రిగా తన తొలి అడుగు వేసింది. బిహార్‌కు చెందిన, కువైట్‌లో నివసిస్తున్న యశితా భరద్వాజ్ తన తొలి పుస్తకం ‘It’s Gen Z!’ ను విడుదల చేసింది. యశితా కువైట్‌లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ – అమ్మాన్ బ్రాంచ్‌లో 9వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, సంగీతంపై ఆసక్తి ఉన్న ఆమె.. తన చుట్టూ ఉన్న అనుభవాలు, పరిశీలనలను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రాసింది.

జెన్ జెడ్ జీవితం ఎలా ఉంటుంది?

‘It’s Gen Z!’ జెన్ జెడ్ తరాన్ని అర్థం చేసుకునేందుకు మార్గదర్శక పుస్తకం కాదు. ఈ తరంలో భాగంగా ఎదుగుతున్న యువతకు ఎదురయ్యే అనుభవాలు, ఆలోచనలు, రోజువారీ జీవితంలోని అంశాలను ఈ పుస్తకం ద్వారా యశితా పంచుకుంది. స్కూల్, స్నేహాలు, కుటుంబ సంభాషణలు, సోషల్ మీడియా, వ్యక్తిగత అనుభవాలు, ఎదుగుతున్న సమయంలో ఎదురయ్యే చిన్నచిన్న సంఘటనలు ఇందులో ప్రస్తావించింది. వివిధ అధ్యాయాల ద్వారా నేటి టీనేజర్ల జీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరించింది.

ఈ పుస్తకం జెన్ జెడ్ కోణంలో రాసినప్పటికీ, అన్ని తరాల పాఠకులను ఆకట్టుకోవాలని యశితా కోరుకుంటోంది. మరో తరానికి చెందిన వ్యక్తి ఈ పుస్తకం చదివి  తను ఈ విషయాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదని అని అనుకుంటే.. తన పుస్తకం లక్ష్యాన్ని సాధించినట్టే అని యశితా పేర్కొంది. యశితా నితిన్ ప్రభాకర్, ప్రీతి భారతి దంపతుల కుమార్తె. చిన్న వయసులోనే తన పఠన, రచనా ఆసక్తులను పుస్తక రూపంలోకి తీసుకురావడం ద్వారా యువ రచయిత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com