ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్న రాజమౌళి కొడుకు..

- August 23, 2016 , by Maagulf
ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్న రాజమౌళి కొడుకు..

చిరంజీవి ల్యాండ్‌మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఇందులో రాజమౌళి కొడుకు కార్తికేయ రోలేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.. చిరంజీవి బర్త్ డే సందర్భంగా నిమిషం నిడివిగల వీడియోని ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేసింది కొణెదల ప్రొడక్షన్..చిరంజీవికి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పింది.ఈ వీడియోని తయారు చేసింది ఎవరోకాదు రాజమౌళి కొడుకు కార్తికేయ! అన్నట్లు కార్తికేయ షోయింగ్ బిజినెస్ పేరుతో ఎప్పటినుండో ఓ కంపెనీ నడుపుతున్నాడట. బాహుబలి మేకింగ్ వీడియో, అఖిల్ మూవీ టీజర్ ఇలా చాలా సినిమాల టీజర్స్‌ని క్రియేటివ్‌గా చేశాడు. సోషల్ మీడియాలో దీనికి మంచి స్పందన కూడా వచ్చింది ఇప్పుడు చిరు బర్త్ డే వీడియో వంతైందని ఫిల్మ్‌న్యూస్. మొత్తానికి ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాడట కార్తీకేయ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com