భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణదశకు...

- August 23, 2016 , by Maagulf
భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణదశకు...

భారత పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణదశకు చేరుకుంటున్నాయనేందుకు తాజా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించడం భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ విమాన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడం అందుకు తార్కాణంగా నిలుస్తోంది.గల్ఫ్ దేశాలకు వెళ్ళే మార్గంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను తొలగించమంటూ కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కు దూరంగా ప్రయాణించేందుకు అనుమతించమంటూ ఆయా విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్థిక, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కు దూరంగా ప్రయాణించాలనుకుంటున్నట్లు విమానయాన సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.గల్ఫ్ దేశాలకు ప్రయాణించే స్పైస్ జెట్, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా సర్వీసులు.. గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం మీదుగా నేరుగా భారత్ లోని అహ్మదాబాద్ కు చేరేట్లు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఓ పక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సహాయపడటంతోపాటు, ఇటువంటి ప్రయాణంవల్ల కంపెనీకి లక్ష రూపాయలవరకూ కలసి వస్తుందన్న రెండు ప్రత్యేక కారణాలను కూడా చూపిస్తూ స్పైస్ జెట్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖమాత్రం విమానయాన సంస్థల అభ్యర్థనపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com