పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- September 27, 2026
మనామా: బహ్రెయిన్ లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిర అభివృద్ధి, కొత్త తరహా పర్యాటక అనుభవాలపై బహ్రెయిన్ దృష్టి సారిస్తోందని పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ అనుసంధానంలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్‌గా “Digital Agenda and Artificial Intelligence to Redesign Tourism”ను ఎంపిక చేశారు. ప్రపంచ పర్యాటక రంగంపై టెక్నాలజీ, ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.
AIతో పర్యాటక సేవల మెరుగుదల
టూరిజం సెక్టర్ స్ట్రాటజీ 2022–2026 లక్ష్యాలకు అనుగుణంగా బహ్రెయిన్ పర్యాటక రంగంలో డిజిటల్ సాధనాలు, ఆధునిక సాంకేతికతల వినియోగాన్ని విస్తరిస్తోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రైవేట్ రంగంతో కలిసి ఏఐ, ఇతర ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. వీటి ద్వారా పర్యాటకులకు అందించే సేవలను మెరుగుపరచడం, పర్యాటక సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, దేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆకర్షణలను చూపించే ఇంటరాక్టివ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
టెక్నాలజీ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. పర్యాటక సంస్థలు వనరులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే సాంకేతిక పరిష్కారాలను అవలంబించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల నిర్వహణపైనా బహ్రెయిన్ దృష్టి సారిస్తోందన్నారు.
దేశంలోని సాంస్కృతిక, చారిత్రక వారసత్వం, బీచ్‌లు, వినోద సదుపాయాలు, విభిన్న పర్యాటక అనుభవాలు భవిష్యత్ పర్యాటక అభివృద్ధికి కీలకమైన బలాలుగా మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, వ్యాపార రంగం, ప్రజల మధ్య సమన్వయంతోనే పర్యాటక రంగం భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందుతుందని అల్ సైరాఫీ తెలిపారు. పర్యాటక రంగంలో సేవలను మెరుగుపరచడంతో పాటు సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ఉద్యోగులను ఈ సందర్భంగా పర్యాటక శాక మంత్రి అభినందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!







