కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!

- September 27, 2026 , by Maagulf
కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!

కువైట్ :  వీధి కుక్కలు కనిపించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Interior Ministry) సూచించింది. వీధి కుక్కలను సమీపించకుండా, వాటిని రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా ఉండాలని పౌరులు, నివాసితులను కోరింది. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, ప్రజా సదుపాయాల సమీపంలో పిల్లలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, వృద్ధుల భద్రతను కూడా నిర్ధారించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

వీధి కుక్కలు కనిపిస్తే 112కు ఫోన్ చేయండి

వీధి కుక్కలు లేదా గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు కనిపిస్తే వాటి కచ్చితమైన ప్రదేశ వివరాలను 112 అత్యవసర నంబర్‌కు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందిన తర్వాత సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని తెలిపారు.

ప్రజలు అధికారులకు సహకరించాలని, భద్రతకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. వీటి ద్వారా ప్రజల భద్రతను పెంచడంతో పాటు వాటి ప్రాణాలను కాపాడేందుకు సహాయపడుతుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com