ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!

- September 28, 2026 , by Maagulf
ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!

మస్కట్ : ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 31 మంది ఆసియా దేశాల పౌరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర అల్ బాతినా గవర్నరేట్‌లోని షినాస్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


కోస్టల్ గార్డ్ పోలీస్ యూనిట్ అధికారులు సముద్రంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ పడవలో ఉన్న 31 మందిని గుర్తించారు. వీరంతా అక్రమంగా ఒమన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని, ప్రస్తుతం వారిపై చట్టపరమైన చర్యలు పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com