యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!

- September 28, 2026 , by Maagulf
యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!

దుబాయ్: యూఏఈలోని నివాసితులు నేషనల్ డే ఐదు రోజుల సెలవుల్లో విదేశీ పర్యటనలకు వెళ్లాలని భావిస్తే ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని ట్రావెల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్, అధిక ఇంధన ధరల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విమాన చార్జీలు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ఏడాది నేషనల్ డే నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల బ్రేక్ లభించనుంది.

కొన్ని రూట్లలో 25–35 శాతం పెరుగుదల
Musafir.com వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్ రషీదా జాహిద్ ప్రకారం.. స్నేహితులు, బంధువులను కలిసేందుకు వెళ్లే VFR (Visiting Friends and Relatives) గమ్యస్థానాలకు విమాన చార్జీలు 25–35 శాతం వరకు పెరగవచ్చు. అదే సమయంలో అధిక డిమాండ్ ఉన్న లీజర్ టూరిజం గమ్యస్థానాలకు ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

ఇక సీట్ల లభ్యత, ప్రయాణ తేదీ, విమానయాన సంస్థల సామర్థ్యం వంటి అంశాలపై ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుందని చెప్పారు. సెలవులకు దగ్గరగా బుకింగ్ చేస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

మాల్దీవులు, థాయ్‌లాండ్‌కు భారీ డిమాండ్
ప్రస్తుతం యూఏఈ నుంచి సెలవులకు బుక్ అవుతున్న అంతర్జాతీయ గమ్యస్థానాల్లో మాల్దీవులు, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా తొలివరుసలో ఉన్నాయి. మాల్దీవులకు సుమారు నాలుగు గంటల ప్రయాణ సమయం, వీసా అవసరం లేకపోవడం, డిసెంబర్‌లో అనుకూలమైన వాతావరణం కారణంగా డిమాండ్ అధికంగా ఉందని dnata ట్రావెల్ తెలిపింది.

 ఐలాండ్ డెస్టినేషన్లకు డిమాండ్
ఎమిరేట్స్ హాలిడేస్ ప్రకారం.. మాల్దీవులు, మారిషస్, సీషెల్స్ కలిపి నేషనల్ డే సెలవుల బుకింగ్స్‌లో సగం వాటాను కలిగి ఉన్నాయి. వీటికి సగటున ఐదు రాత్రుల స్టే బుక్ చేసుకుంటున్నారు. థాయ్‌లాండ్‌కు వెళ్లే వారి సగటు స్టే ఆరు రాత్రులుగా ఉంది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎమిరేట్స్ విమానాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హెల్సింకి కూడా కొత్తగా ఆసక్తిని ఆకర్షిస్తోంది. న్యూజిలాండ్, పోర్చుగల్, ట్యునీషియా వంటి కొత్త గమ్యస్థానాలపై కూడా నివాసితుల్లో ఆసక్తి పెరుగుతోందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపింది.

దక్షిణాఫ్రికా బుకింగ్స్ 58% పెరుగుదల
దక్షిణాఫ్రికాకు సంబంధించిన ట్రావెల్ బుకింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 58 శాతం పెరిగాయి. యూఏఈ లోనే హోటళ్లు, రిసార్టుల్లో గడిపే స్టేకేషన్ బుకింగ్స్ కూడా 23 శాతం పెరిగాయి. నేషనల్ డే సెలవుల సమయంలో ప్రయాణాలకు సంబంధించి కుటుంబాల బుకింగ్స్ 48 శాతం, కపుల్ బుకింగ్స్ 45 శాతంగా ఉన్నాయని తెలిపింది.  ట్రావెల్ డిమాండ్ ఇప్పటికే పెరుగుతున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే బుకింగ్ చేసుకోవడం ద్వారా అధిక ఛార్జీలను తప్పించుకునే అవకాశం ఉంటుందని ట్రావెల్ సంస్థలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com