దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- November 18, 2026
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో ప్రయాణికులకు మరో కొత్త షాపింగ్ అనుభూతి అందుబాటులోకి రానుంది. దుబాయ్ మాల్లోని ఫ్యాషన్ అవెన్యూ తరహాలో టెర్మినల్-3లో ప్రత్యేకంగా అత్యాధునిక షాపింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్, లగ్జరీ బ్రాండ్లను ఇక్కడకు తీసుకురావడానికి విమానాశ్రయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ.. టెర్మినల్-3లోని కాంకోర్స్-బి పశ్చిమ ప్రాంతంలో ఈ కొత్త షాపింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇక్కడి దుకాణాల్లో ప్రముఖ లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
దుబాయ్ మాల్లోని ఫ్యాషన్ అవెన్యూ ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్, ఆభరణాలు, వాచీలు, సౌందర్య ఉత్పత్తులు, ఇతర విలాసవంతమైన వస్తువుల బ్రాండ్లకు ప్రసిద్ధి చెందింది. మరోవైపు, 2026 తొలి తొమ్మిది నెలల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 50.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రాంతీయ సైనిక ఘర్షణల కారణంగా విమానయాన రంగంలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా పుంజుకుంటున్నాయి.
2026 మూడో త్రైమాసికంలో 18.8 మిలియన్ల మంది ప్రయాణించారు. ఆగస్టు నెలలో అత్యధికంగా 6.6 మిలియన్ల మంది విమానాశ్రయానికి వచ్చారు. అయితే సెప్టెంబర్ వరకు ఏడాది ప్రాతిపదికన ప్రయాణికుల సంఖ్య 28.1 శాతం తగ్గగా, మూడో త్రైమాసికంలో 22.1 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది మొత్తం 70 మిలియన్లకు పైగా ప్రయాణికులకు స్వాగతం పలుకుతామని, 2027 చివరి నాటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరుతుందని పాల్ గ్రిఫిత్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త షాపింగ్ కేంద్రంలోకి స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లు ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. దుకాణాల నిర్మాణ, అలంకరణ పనులు దాదాపు పూర్తయ్యాయని, రిటైల్ ఒప్పందాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, సంక్షోభ సమయంలో తగ్గిన డ్యూటీ ఫ్రీ షాపింగ్ అమ్మకాలు కూడా తిరిగి పుంజుకున్నాయని గ్రిఫిత్స్ తెలిపారు. దుబాయ్ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలతో పాటు వాణిజ్య కార్యకలాపాలు కూడా క్రమంగా పూర్వస్థితికి చేరుకుంటున్నాయని తెలిపారు
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







