యూఏఈ నేషనల్ డేకి షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు

- November 18, 2026 , by Maagulf
యూఏఈ నేషనల్ డేకి షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు

డిసెంబర్ 2 నుంచి 6 వరకు హాలిడేస్.. డిసెంబర్ 7న తిరిగి విధులకు హాజరు

షార్జా: యూఏఈ నేషనల్ డే(ఈద్ అల్ ఇతిహాద్) సందర్భంగా షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు షార్జా ప్రభుత్వ మానవ వనరుల విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 (బుధవారం), డిసెంబర్ 3 (గురువారం) తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. షార్జాలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వారాంతపు సెలవులు ఉండటంతో, డిసెంబర్ 2 నుంచి 6 వరకు వరుసగా ఐదు రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు లభించనున్నాయి. డిసెంబర్ 7 (సోమవారం) నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి.

ఇదిలా ఉండగా, దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐదు రోజుల సెలవులు ప్రకటించారు. దుబాయ్‌లో శుక్రవారం, డిసెంబర్ 4వ తేదీని అదనపు అధికారిక సెలవుగా ప్రకటించారు.

మరోవైపు, యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) కూడా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు సెలవులు ప్రకటించింది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కలిసిరావడంతో వారికి కూడా ఐదు రోజుల పాటు విరామం లభించనుంది.

యూఏఈ 55వ నేషనల్ డే వేడుకల సందర్భంగా ఉద్యోగులకు ఈ సెలవులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com