బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- November 18, 2026
మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్‌పురోహిత్ ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్నేహ రిక్రియేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ ప్యాట్రన్ మంజు రాజ్‌పురోహిత్ కూడా పాల్గొన్నారు. స్నేహ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న సేవలను రాయబారి పరిశీలించారు. పిల్లల్లో జీవన నైపుణ్యాలు, శారీరక కదలికలకు సంబంధించిన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు, వాలంటీర్లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్‌పురోహిత్, మంజు రాజ్‌పురోహిత్ ప్రతి చిన్నారికి బహుమతులు అందజేశారు. దీంతో చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది. అనంతరం పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం సందేశాన్ని చాటిచెప్పేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నేహ కేంద్రంలోని చిన్నారులతో పాటు న్యూ హారిజన్ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







