ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- September 29, 2026
రియాద్ : డ్రోన్ దాడుల కారణంగా దెబ్బతిన్న ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ మరమ్మతులు పూర్తికావడంతో సౌదీ అరేబియా ఈ మార్గం ద్వారా చమురు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది. సెప్టెంబర్ 10న జరిగిన డ్రోన్ దాడుల అనంతరం పైప్‌లైన్‌ను మరమ్మతులు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌కు రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేసే సామర్థ్యం ఉంది. సాధారణంగా ఇందులో సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు సౌదీ పశ్చిమ తీరంలోని రిఫైనరీలకు వెళ్తుంది. మిగిలిన సామర్థ్యాన్ని చమురు ఎగుమతులకు ఉపయోగిస్తారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ సమయంలో ఈ పైప్‌లైన్ సౌదీ చమురు సరఫరాకు కీలకమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారింది. తాజాగా పైప్‌లైన్ పునరుద్ధరణతో అంతర్జాతీయ మార్కెట్‌కు చమురు సరఫరా చేసే మరో ప్రధాన మార్గం అందుబాటులోకి వచ్చింది.
ఈ నెలలో సౌదీ అరేబియా హోర్ముజ్ జలసంధి ద్వారా కూడా చమురు ఎగుమతులను పెంచుతున్నట్లు తెలిపింది. ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ తిరిగి పూర్తి సామర్థ్యంతో పనిచేసే పరిస్థితుల్లో హోర్ముజ్ జలసంధి ద్వారా సౌదీ ఎంతమేర చమురును రవాణా చేస్తుందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
అరేబియా గల్ఫ్‌లో నౌకల రాకపోకలకు భద్రతా సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గం చమురు సరఫరాలను కొనసాగించడంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధర బ్యారెల్‌కు $107కు పైగా నమోదవుతోంది.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!







