ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- November 18, 2026
దోహా: ఖతార్‌లోని డ్రీమా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రానికి చెందిన చిన్నారులకు సముద్ర, పర్యావరణ శాస్త్రాలపై అవగాహన కల్పించేందుకు ఖతార్ యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. 2026 నవంబర్ 8 నుంచి 10 వరకు ఖతార్ యూనివర్సిటీలోని పర్యావరణ విజ్ఞాన కేంద్రం (Environmental Science Center) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డ్రీమా వరల్డ్ ఆఫ్ సీస్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మక అనుభవాన్ని అందించారు.
ఈ సందర్భంగా చిన్నారులు పర్యావరణ విజ్ఞాన కేంద్రంలోని పరిశోధనశాలలను సందర్శించారు. పర్యావరణ నమూనాలను పరీక్షించేందుకు ఉపయోగించే శాస్త్రీయ పరికరాలు, సముద్ర జీవావరణ వ్యవస్థల అధ్యయనం, పర్యావరణ మార్పులను పరిశోధించే విధానాల గురించి తెలుసుకున్నారు. రెండో రోజు ఖతార్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన నౌక ‘జనన్’ను సందర్శించారు. సముద్ర పరిశోధనలు ఎలా నిర్వహిస్తారో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేఖా నజ్లా బింట్ అహ్మద్ బిన్ అలీ అల్ థానీ, పర్యావరణ విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ ఫారెస్ అల్ మొమానీ, పరిశోధన నౌక జనన్ మేనేజర్ ప్రొఫెసర్ జాసిమ్ అల్ ఖయ్యత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఫారెస్ అల్ మొమానీ మాట్లాడుతూ.. చిన్నారులకు పరిశోధన కేంద్రాలు, శాస్త్రీయ వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారిలో శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించవచ్చని తెలిపారు. ప్రత్యక్ష అనుభవంతో కూడిన విద్యా కార్యక్రమాలు శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, పరిశీలన, అన్వేషణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. డ్రీమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేఖా నజ్లా మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన విద్యా అనుభవాలను అందించడం, వారి పరిజ్ఞానాన్ని విస్తరించడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందించడం తమ లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







