కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- October 01, 2026
కువైట్ : నిర్మాణం, కూల్చివేత, మరమ్మతుల పనుల సమయంలో ఏర్పడే వ్యర్థాలను తొలగించి, నిర్దేశిత ప్రాంతాల్లో పారవేయాల్సిన బాధ్యత ప్రాపర్టీ యజమాని లేదా కాంట్రాక్టర్‌దే అని కువైట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఈ పనులు మునిసిపాలిటీ పరిధిలోకి రావని తెలిపింది. నిర్మాణ పనులకు సంబంధించిన ఒప్పందాల్లోనే నిర్మాణ వ్యర్థాలను తొలగించే బాధ్యతను స్పష్టంగా పేర్కొనాలని యజమానులకు అల్జహ్రా గవర్నరేట్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ అల్-హుమైదీ అల్-ముతైరీ సూచించారు.
ఇక పనుల పరిమాణాన్ని బట్టి నిర్మాణ వ్యర్థాలను 3 నుంచి 7 రోజుల్లో తొలగించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందాల్లో నిబంధన చేర్చాలని ఆయన తెలిపారు. నిర్మాణం, మరమ్మతులు లేదా కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతాల ముందు తగిన వ్యర్థాల కంటైనర్లు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కాంట్రాక్టుల్లో చేర్చాలని సూచించారు. ఇటీవల నిర్మాణ ప్రదేశాల వద్ద ఇలాంటి కంటైనర్ల వినియోగం పెరిగిందని మునిసిపాలిటీ తెలిపింది.
మునిసిపాలిటీ నిర్వహిస్తున్న ‘బిల్డ్, డోంట్ డిస్ట్రాయ్’ ప్రచారంలో భాగంగా నిర్మాణ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను తొలగించే బాధ్యత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో పేర్కొన్న సందర్భాల్లో, నిబంధనలు పాటించకపోతే కాంట్రాక్టర్లపై ఉల్లంఘన చర్యలు తీసుకోవచ్చని అల్-ముతైరీ తెలిపారు.
అయితే ప్రైవేట్ ఇళ్లలో అనుమతి లేకుండా చేపట్టే చిన్నపాటి మరమ్మతుల పనుల వల్ల వ్యర్థాలు ఏర్పడితే, అవసరమైన సందర్భాల్లో ఆస్తి యజమానిపై ఉల్లంఘన నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రాపర్టీ యజమానులు, కాంట్రాక్టర్లు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అల్-ముతైరీ కోరారు. నిర్మాణ వ్యర్థాలను ఇళ్ల ముందు లేదా బహిరంగ ప్రదేశాల్లో పోగు చేయకుండా, మునిసిపాలిటీ నిర్దేశించిన ప్రాంతాల్లోనే పారవేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







