సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- October 01, 2026
కువైట్: కువైట్ ఏకీకృత ప్రభుత్వ సేవల యాప్ ‘సహల్’ (Sahl) కొత్తగా ‘బలాగ్’ (Balagh) సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా పౌరులు, నివాసితులు తమ ఫిర్యాదులు, సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలకు నేరుగా పంపించవచ్చు. ప్రజలు ఫిర్యాదులు, నివేదికలు సమర్పించే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, వాటిని సంబంధిత అధికారులు వేగంగా స్వీకరించి పరిష్కరించేలా చేయడం ఈ సేవ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ‘బలాగ్’ సేవ పరిధిలో పలు ప్రభుత్వ సంస్థలను చేర్చారు. ఇందులో ప్రజా పనుల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, అలాగే టెలికమ్యూనికేషన్స్, ఫుడ్, ఇంటిగ్రిటీ, క్యాపిటల్ మార్కెట్స్ సంబంధిత సంస్థలు, కువైట్ మున్సిపాలిటీ ఉన్నాయి. ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య సమాచార మార్పిడిని మరింత మెరుగుపరచడం, ఫిర్యాదులను సంబంధిత అధికారులకు వేగంగా చేరవేయడం, వాటిపై స్పందన సామర్థ్యాన్ని పెంచడం ‘బలాగ్’ సేవ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







