సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- October 03, 2026
మనామా: సుస్థిర అభివృద్ధి, హరిత ఆర్థిక వ్యవస్థ, కార్బన్ న్యూట్రాలిటీపై అవగాహన పెంచేందుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం ప్రారంభమైంది. మనామాలో మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇస్తిదామా సెంటర్’ను ఉప ప్రధాని షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. సుస్థిరత రంగంలో అవగాహన, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి ఈ కేంద్రం ప్రత్యేక వేదికగా పనిచేయనుంది. వివిధ రంగాల్లో పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించడం, సుస్థిర పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రి వయేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, చమురు–పర్యావరణ మంత్రి, వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ బిన్ ముబారక్ బిన్ దైనా పాల్గొన్నారు. మౌలిక వసతులు, ఆవిష్కరణల్లో నిరంతర పెట్టుబడులు కీలక రంగాల్లో సుస్థిరతకు దోహదం చేస్తాయని షేక్ ఖాలిద్ పేర్కొన్నారు. వనరులను సమర్థంగా వినియోగిస్తూ.. ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
బహ్రెయిన్ జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో సుస్థిరతకు ప్రాధాన్యత కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, 2060 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలన్న లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం–ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో సుస్థిరత లక్ష్యాలను ఆచరణాత్మక కార్యక్రమాలుగా మార్చవచ్చని ఉప ప్రధాని పేర్కొన్నారు. పర్యావరణ ఆవిష్కరణలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అందించడంతో పాటు జాతీయ ప్రతిభను అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







