పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- October 03, 2026
దమ్మామ్: కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ కస్టమ్స్ అధికారులు 40వేల యాంఫెటమైన్ పిల్స్ అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గాజు కప్పుల మధ్య దాచిన ఈ మాదకద్రవ్యాలను పోస్టల్ పార్సిల్‌లో సౌదీ అరేబియాలోకి తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి చేరుకున్న పార్సిల్‌ను కస్టమ్స్ నిబంధనల ప్రకారం చేపట్టిన తనిఖీల్లో గాజు కప్పులు ఉన్న పార్సిల్‌లో దాచిన పిల్స్ బయటపడ్డాయని జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికార ప్రతినిధి హమూద్ అల్-హర్బీ తెలిపారు.
అనంతరం, సౌదీ అరేబియాలో ఈ షిప్‌మెంట్‌ను స్వీకరించాల్సిన వ్యక్తులను గుర్తించేందుకు ZATCA.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో కలిసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.దేశంలోకి, బయటకు వెళ్లే సరుకులపై కస్టమ్స్ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని అల్-హర్బీ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు భద్రతా సమాచార మార్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించాలని ZATCA కోరింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, దాని ఆధారంగా ఉల్లంఘన నిర్ధారణ అయితే ఆర్థిక బహుమతులు కూడా అందజేస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







