తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- October 03, 2026
తైఫ్: తైఫ్-రియాద్ హైవేపై గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళా ఉపాధ్యాయినులు, వారి డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ సెంటర్ దర్యాప్తు ప్రారంభించింది. మక్కా ప్రాంతంలోని అల్-మువైహ్ గవర్నరేట్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన ఉపాధ్యాయినులు అల్-మువైహ్‌కు వాయువ్యంగా ఉన్న హైలాన్ ఎలిమెంటరీ అండ్ ఇంటర్మీడియట్ స్కూల్‌కు విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు గర్భిణి అని ఆమె బంధువు తెలిపినట్లు సమాచారం.
ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను అల్-మువైహ్ ఆసుపత్రికి తరలించారు. తైఫ్-రియాద్ హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నట్లు తమకు సమాచారం అందిందని నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ సెంటర్ వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు సంబంధిత అధికారులతో కలిసి ప్రత్యేక భద్రతా దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. ఘటనకు సంబంధించిన సమాచారం, డేటాను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







