అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!

- October 03, 2026 , by Maagulf
అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!

అబుదాబి: యూఏఈలో నిర్వహించే బిగ్ టికెట్ సెప్టెంబర్ చివరి వారపు ఈ-డ్రాలో భారత్, పాకిస్థాన్‌కు చెందిన నలుగురు విజేతలు కలిపి 1 లక్ష దిర్హామ్‌ల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఇందులో భారతీయ ప్రవాసులకు చెందిన పలువురికి బహుమతులు దక్కాయి. భారత్‌కు చెందిన థెస్లిముల్ అరీఫ్ పొన్నాత్, ప్రస్తుతం యూఏఈలో నివసిస్తున్నారు. ఆయన కొనుగోలు చేసిన బిగ్ టికెట్‌కు 25,000 దిర్హామ్‌ల బహుమతి లభించింది. మరో విజేత రాకీ సుబ్బా  దుబాయ్‌లోని రవాణా విభాగంలో పనిచేస్తున్నారు. గత ఆరేళ్లుగా కుటుంబంతో కలిసి యూఏఈలో నివసిస్తున్న ఆయన.. ఓ స్నేహితుడి ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకున్నారు. మొదటిసారి టికెట్ కొనుగోలు చేయగానే అదృష్టం వరించింది. రాకీ ఐదుగురు స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేశారు. తన పుట్టినరోజు తేదీ ఆధారంగా నంబర్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. వచ్చిన నగదు బహుమతిని స్నేహితులతో కలిసి పంచుకోనున్నట్లు వెల్లడించారు.

అబుదాబిలో 11 ఏళ్లుగా నివసిస్తున్న ముంబైకి చెందిన కునాల్ పిళ్లై కూడా విజేతల్లో ఉన్నారు. ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన.. భార్యతో కలిసి స్నేహితుల కుటుంబంతో బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నారు. తాజా డ్రా కోసం ఆరుగురు కలిసి ఆరు టికెట్లు కొనుగోలు చేశారు. విజయం సాధించినట్లు ఫోన్ రావడంతో తొలుత షాక్‌కు గురయ్యానని, ఆ తర్వాత ఎంతో ఆనందంగా అనిపించిందని కునాల్ తెలిపారు.

అక్టోబర్‌లో భారీ బహుమతులు
అక్టోబర్ నెల బిగ్ టికెట్ ప్రమోషన్‌లో 2.5 కోట్ల దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. నవంబర్ 3న జరిగే లైవ్ డ్రాలో విజేతను ప్రకటించనున్నారు. అదే డ్రాలో ఐదుగురు కన్సొలేషన్ ప్రైజ్ విజేతలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బార్ అందించనున్నారు. అక్టోబర్‌లో ప్రతి వారం జరిగే ఈ-డ్రాల్లో నలుగురు విజేతలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బార్ అందించనున్నారు. ఈ డ్రాలను బిగ్ టికెట్ యూట్యూబ్ ఛానల్, వెబ్‌సైట్‌లో రాత్రి 7:30 గంటలకు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

అక్టోబర్‌లో కనీసం ఒక బిగ్ టికెట్ కొనుగోలు చేసిన వారికి నవంబర్ 3న జరిగే బిగ్ స్పిన్‌లో పాల్గొనే ముగ్గురిలో ఒకరిగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3న జరిగే బిగ్ స్పిన్‌లో ఒక్కొక్కరు గరిష్ఠంగా 10 లక్షల దిర్హామ్‌లు గెలుచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు రెండు డ్రీమ్ కార్ డ్రాలు కూడా నిర్వహించనున్నారు. నవంబర్ 3న రేంజ్ రోవర్ వెలార్, డిసెంబర్ 3న నిస్సాన్ పట్రోల్ కార్లను విజేతలకు అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com