మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- October 03, 2026
కువైట్: మనీ లాండరింగ్ కేసులో ఎనిమిది మంది ప్రవాసులకు కువైట్ స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు చెందిన క్రిమినల్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే మొత్తం 18 మిలియన్ కువైట్ దినార్ల (KD) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న రెండు వాణిజ్య సంస్థలకు కూడా కోర్టు 9 మిలియన్ కువైట్ దినార్ల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ రెండు సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించింది.
జడ్జి నాసర్ అల్-బదర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జడ్జిలు ఒమర్ అల్-ములైఫీ, అబ్దుల్లా అల్-ఫలేహ్, సలేం అల్-జాయెద్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఈ కేసులో కోర్టు విచారణ అనంతరం ఈ శిక్షలు, జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







