మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!

- October 03, 2026 , by Maagulf
మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!

కువైట్: మనీ లాండరింగ్ కేసులో ఎనిమిది మంది ప్రవాసులకు కువైట్ స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన క్రిమినల్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే మొత్తం 18 మిలియన్ కువైట్ దినార్ల (KD) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న రెండు వాణిజ్య సంస్థలకు కూడా కోర్టు 9 మిలియన్ కువైట్ దినార్ల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ రెండు సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించింది.

జడ్జి నాసర్ అల్-బదర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జడ్జిలు ఒమర్ అల్-ములైఫీ, అబ్దుల్లా అల్-ఫలేహ్, సలేం అల్-జాయెద్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఈ కేసులో కోర్టు విచారణ అనంతరం ఈ శిక్షలు, జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com