అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- October 03, 2026
అబుదాబి: యూఏఈలో నిర్వహించే బిగ్ టికెట్ సెప్టెంబర్ చివరి వారపు ఈ-డ్రాలో భారత్, పాకిస్థాన్‌కు చెందిన నలుగురు విజేతలు కలిపి 1 లక్ష దిర్హామ్‌ల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఇందులో భారతీయ ప్రవాసులకు చెందిన పలువురికి బహుమతులు దక్కాయి. భారత్‌కు చెందిన థెస్లిముల్ అరీఫ్ పొన్నాత్, ప్రస్తుతం యూఏఈలో నివసిస్తున్నారు. ఆయన కొనుగోలు చేసిన బిగ్ టికెట్‌కు 25,000 దిర్హామ్‌ల బహుమతి లభించింది. మరో విజేత రాకీ సుబ్బా దుబాయ్‌లోని రవాణా విభాగంలో పనిచేస్తున్నారు. గత ఆరేళ్లుగా కుటుంబంతో కలిసి యూఏఈలో నివసిస్తున్న ఆయన.. ఓ స్నేహితుడి ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకున్నారు. మొదటిసారి టికెట్ కొనుగోలు చేయగానే అదృష్టం వరించింది. రాకీ ఐదుగురు స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేశారు. తన పుట్టినరోజు తేదీ ఆధారంగా నంబర్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. వచ్చిన నగదు బహుమతిని స్నేహితులతో కలిసి పంచుకోనున్నట్లు వెల్లడించారు.
అబుదాబిలో 11 ఏళ్లుగా నివసిస్తున్న ముంబైకి చెందిన కునాల్ పిళ్లై కూడా విజేతల్లో ఉన్నారు. ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన.. భార్యతో కలిసి స్నేహితుల కుటుంబంతో బిగ్ టికెట్లో పాల్గొంటున్నారు. తాజా డ్రా కోసం ఆరుగురు కలిసి ఆరు టికెట్లు కొనుగోలు చేశారు. విజయం సాధించినట్లు ఫోన్ రావడంతో తొలుత షాక్‌కు గురయ్యానని, ఆ తర్వాత ఎంతో ఆనందంగా అనిపించిందని కునాల్ తెలిపారు.
అక్టోబర్‌లో భారీ బహుమతులు
అక్టోబర్ నెల బిగ్ టికెట్ ప్రమోషన్లో 2.5 కోట్ల దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. నవంబర్ 3న జరిగే లైవ్ డ్రాలో విజేతను ప్రకటించనున్నారు. అదే డ్రాలో ఐదుగురు కన్సొలేషన్ ప్రైజ్ విజేతలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బార్ అందించనున్నారు. అక్టోబర్‌లో ప్రతి వారం జరిగే ఈ-డ్రాల్లో నలుగురు విజేతలకు ఒక్కొక్కరికి 200 గ్రాముల 24 క్యారెట్ల బంగారు బార్ అందించనున్నారు. ఈ డ్రాలను బిగ్ టికెట్ యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్లో రాత్రి 7:30 గంటలకు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
అక్టోబర్‌లో కనీసం ఒక బిగ్ టికెట్ కొనుగోలు చేసిన వారికి నవంబర్ 3న జరిగే బిగ్ స్పిన్‌లో పాల్గొనే ముగ్గురిలో ఒకరిగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3న జరిగే బిగ్ స్పిన్‌లో ఒక్కొక్కరు గరిష్ఠంగా 10 లక్షల దిర్హామ్‌లు గెలుచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు రెండు డ్రీమ్ కార్ డ్రాలు కూడా నిర్వహించనున్నారు. నవంబర్ 3న రేంజ్ రోవర్ వెలార్, డిసెంబర్ 3న నిస్సాన్ పట్రోల్ కార్లను విజేతలకు అందించనున్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







