మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- October 03, 2026
మస్కట్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ‘వికసిత్ భారత్ సాలిడారిటీ రన్’ నిర్వహించారు. అక్టోబర్ 2న జరిగిన ఈ కార్యక్రమంలో ఒమన్‌లోని ఇండియన్ కమ్యూనిటీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 7.0’లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సేవా పఖ్వాడా (సెప్టెంబర్ 17–అక్టోబర్ 2) సందర్భంగా జరిగింది. భారతీయులు, ప్రవాస భారతీయుల మధ్య ఐక్యతను పెంపొందించడం, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధులు సహా వివిధ వయసుల వారు రన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ-షర్టులు అందించగా, రన్ పూర్తి చేసిన వారికి జ్ఞాపిక పతకాలను అందజేశారు.
రన్‌కు ముందు జుంబా, వార్మప్ వ్యాయామాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. “ఫిట్నెస్ కీ డోస్, ఆధా ఘంటా రోజ్” అనే ఫిట్ ఇండియా సందేశంతో ప్రతిరోజూ శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిర్వాహకులు ప్రోత్సహించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ పాటించిన క్రమశిక్షణ, సరళత, శారీరక ఆరోగ్యం, సమాజ సేవ వంటి విలువలను కూడా గుర్తుచేశారు. ఆరోగ్యకరమైన, చురుకైన జనాభా దేశ అభివృద్ధికి కీలక పునాది అని కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.
ఒమన్‌లోని భారత రాయబారి ప్రశాంత్ పిసే పాల్గొని, భారత ప్రవాసుల ఉత్సాహాన్ని అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ తరాలకు చెందిన భారతీయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ రన్.. ఫిట్నెస్, ఐక్యత, సేవా స్ఫూర్తితో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రవాస భారతీయుల అనుబంధాన్ని చాటింది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







