కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- October 03, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ అక్రమ రవాణాకు చేసిన రెండు ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. టెర్మినల్ 4, టెర్మినల్ 5లో జరిపిన తనిఖీల్లో మారిజువానా, హెరాయిన్‌గా అనుమానిస్తున్న పొడి, హషీష్ స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది.
ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి కువైట్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై టెర్మినల్ 4లో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను తనిఖీ చేయగా అమ్మకానికి సిద్ధంగా ప్యాక్ చేసిన 564 ప్యాకెట్ల మారిజువానా గుర్తించారు. వాటి మొత్తం బరువు 1.763 కిలోలుగా అధికారులు తెలిపారు. నిందితురాలు బెనిన్ దేశానికి చెందిన మహిళ కాగా, కువైట్‌లో గృహ కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు కస్టమ్స్ వెల్లడించింది.
టెర్మినల్ 5లో భారతీయ ప్రయాణికుడి వద్ద..
మరో ఘటనలో టెర్మినల్ 5లో ఓ భారతీయ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద హెరాయిన్‌గా అనుమానిస్తున్న పొడితో కూడిన ఏడు కవర్లు గుర్తించారు. వాటి మొత్తం బరువు 2 గ్రాములుగా ఉంది. అదే సమయంలో 8 గ్రాముల హషీష్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రెండు ఘటనల్లోనూ చట్టపరమైన చర్యలు చేపట్టి, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌కు సంబంధించిన సీజ్ నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. ఇద్దరు ప్రయాణికులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కంట్రోల్ కు అప్పగించనున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







