హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- October 03, 2026
తెహ్రాన్: హార్ముజ్ జలసంధి ప్రాంతంలో రెండు చమురు ట్యాంకర్లపై ‘గుర్తుతెలియని ప్రాజెక్టైల్స్’దాడి చేసినట్లు బ్రిటన్‌కు చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించింది. దీంతో ఈ కీలక జలమార్గంలో నౌకల రాకపోకలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలో హార్ముజ్ జలసంధి కీలక ప్రాంతంగా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోందని, అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్నాయని భావించిన నౌకలపై కాల్పులు జరుపుతోందని సమాచారం. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు అమెరికా కూడా ఇరాన్ నౌకాశ్రయాలపై ప్రతిఘటన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
తొలి ట్యాంకర్‌పై దాడి
తొలి దాడిలో ట్యాంకర్లో చిన్నపాటి మంటలు చెలరేగడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే కొద్దిసేపటి తర్వాత మంటలను అదుపులోకి తీసుకున్నట్లు UKMTO తెలిపింది. కాగా ఘటనలో ఎవరూ గాయపడలేదని, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వెళ్తున్న ఆ నౌక తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించిందని తెలిపారు. అయితే నౌక ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి వెళ్తోంది అనే వివరాలను వెల్లడించలేదు.
మరో ట్యాంకర్‌పైనా దాడి
కొన్ని గంటల తర్వాత ఒమన్‌కు తూర్పున మరో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్‌పై ‘తెలియని ప్రాజెక్టైల్’ తాకినట్లు సమాచారం అందింది. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగలేదని UKMTO తెలిపింది. ఈ రెండు ఘటనలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు బ్రిటిష్ మారిటైమ్ ఏజెన్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







