మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- October 03, 2026
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ అధికారులు ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సూసైడ్ బాంబర్ ఘటన జరగలేదని స్పష్టం చేశారు.
సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ తెలిపిన వివరాల ప్రకారం.. మక్కాలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చిన వారిని వేధిస్తూ, ప్రజల్లో భయాందోళనకు కారణమయ్యాడు. దీంతో భద్రతా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ వెల్లడించింది.
గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అసత్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా, సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచే తెలుసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







