మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!

- October 03, 2026 , by Maagulf
మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!

మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ అధికారులు ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సూసైడ్ బాంబర్ ఘటన జరగలేదని స్పష్టం చేశారు.

సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ తెలిపిన వివరాల ప్రకారం.. మక్కాలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చిన వారిని వేధిస్తూ, ప్రజల్లో భయాందోళనకు కారణమయ్యాడు. దీంతో భద్రతా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ వెల్లడించింది.

గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అసత్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా, సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచే తెలుసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com