థాయ్‌లాండ్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది

- August 23, 2016 , by Maagulf
థాయ్‌లాండ్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది

థాయ్‌లాండ్‌: పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న థాయ్‌లాండ్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్‌లోని సదరన్‌ హోటల్‌ పార్కింగ్‌ ప్రాంతంలోనూ, హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌కు 10% శాతం వరకు ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com