ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు

- October 03, 2026 , by Maagulf
ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు

దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఉగ్ర చర్యలో గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరామర్శించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణలో పైలట్ గాయపడ్డారు.బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన అనంతరం ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించారు.ఈ ఘటన సమయంలో ప్రయాణికుల భద్రత కోసం కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన ధైర్యం, బాధ్యతాయుతమైన చర్యలను షేక్ హమ్దాన్ ప్రశంసించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, బాధ్యత, శ్రద్ధ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.“ఆయన మా బృందంలో భాగమైనందుకు, మా దేశ కథలో భాగమైనందుకు, యూఏఈలోని మానవ అనుభవంలో భాగమైనందుకు గర్విస్తున్నాం. ఇది ప్రేమకు, శాంతికి, జీవితానికి నిలయమైన దేశం” అని షేక్ హమ్దాన్ పేర్కొన్నారు.ఉగ్ర చర్యగా నిర్ధారించిన యూఏఈ దర్యాప్తుఈ ఘటనపై యూఏఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానంలో సహ పైలట్ “ఉగ్ర చర్య”కు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు యూఏఈ అటార్నీ జనరల్ కౌన్సిలర్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ వెల్లడించారు.విమానం గాల్లో ఉండగానే సహ పైలట్ కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్ఛర్‌పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే క్రాష్ యాక్స్ను ఉపయోగించి, విమాన నియంత్రణను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు, దాడికి గల కారణం, ఇతర సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. భౌతిక, డిజిటల్ ఆధారాలను విశ్లేషించడంతో పాటు సాంకేతిక పరీక్షలను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు.పైలట్ ధైర్యాన్ని ప్రశంసించిన అన్వర్ గర్గాష్కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యాన్ని యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ కూడా ప్రశంసించారు.ప్రమాదకరమైన ఉగ్ర చర్య, సంభవించే భారీ విపత్తును ఎదుర్కొన్న సమయంలో మచ్ఛర్ ధైర్యం, బాధ్యతకు ప్రతీకగా నిలిచారని గర్గాష్ అక్టోబర్ 2న పేర్కొన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ప్రొఫెషనలిజం, నైతిక బాధ్యతను ప్రదర్శించారని అన్నారు.అయితే ఘటనను అతిగా సరళీకరించడం లేదా కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం సరికాదని గర్గాష్ హెచ్చరించారు. తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు అప్రమత్తత అవసరమని తెలిపారు.అక్టోబర్ 3న కూడా గర్గాష్ స్పందిస్తూ, తాజా ఉగ్ర చర్య మరో హెచ్చరికగా అభివర్ణించారు. “తీవ్రవాదంతో ఈ ప్రాంతం చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంది. ద్వేషపూరిత ప్రసంగం ద్వారా ఉగ్రవాదాన్ని సమర్థించడం కూడా ప్రమాదంలో భాగమే” అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com