బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- October 04, 2026
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెనుక ప్రాంతంలో మాంగ్రూవ్ చెట్లతో ప్రత్యేక గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. తీరప్రాంతాన్ని పరిరక్షించడంతో పాటు చేపలు, సముద్ర జీవులు, పక్షులకు కొత్త ఆవాసాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ అల్ మొకాహ్వి సూచించారు. ఖలాలీ, హిద్ద్ ప్రాంతాల మధ్య ఉన్న విమానాశ్రయం వెనుక లగూన్లో మాంగ్రూవ్ చెట్లను నాటేందుకు అల్ మొకాహ్వి ప్రతిపాదించారు. ఈ ప్రాంతం సముద్ర పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మాంగ్రూవ్ అడవులు చేపలు, క్రస్టేసియన్లకు సహజ నర్సరీ ప్రాంతాలుగా పనిచేస్తాయని, సముద్ర పక్షులు, ఇతర వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తాయని అల్ మొకాహ్వి తెలిపారు. అలాగే ఇవి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించడంతో పాటు నీటిలోని కొన్ని కాలుష్య కారకాలను వడపోసేందుకు, అలలు, గాలుల కారణంగా తీరప్రాంతంలో జరిగే కోతను తగ్గించేందుకు సహాయపడతాయని వివరించారు. ఈ ప్రాంతంలో మాంగ్రూవ్ చెట్లను పెంచడం వల్ల తీరప్రాంతం అందంగా మారడంతో పాటు సహజసిద్ధమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
2023లో ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్, బ్లాక్ 102లోని ఒక స్థలాన్ని అరాద్ బే ప్రొటెక్టెడ్ ఏరియా తరహాలో మాంగ్రూవ్ నేచర్ రిజర్వ్‌గా అభివృద్ధి చేయాలన్న అల్ మొకాహ్వి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో ఈ రిజర్వ్‌ను ఖలాలీ తీరప్రాంతంలో, ప్రధాన డ్రై డాక్ హైవేకు ఎదురుగా అభివృద్ధి చేయనున్న వాటర్‌ఫ్రంట్ ప్రాజెక్టుతో అనుసంధానించే అవకాశాన్ని కూడా అప్పట్లో ప్రతిపాదించారు. తాజా ప్రతిపాదన అమలైతే బహ్రెయిన్ తీరప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, పచ్చదనం పెంపునకు మరో కీలక ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్‌లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- పాకిస్థాన్‌లో ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి!
- సౌదీ సరిహద్దుల్లో ‘అబ్షర్ ట్రావెల్’ సేవలకు ఎలక్ట్రిక్ బైక్‌లు..!!
- సౌదీ అరేబియాలో 2027 నుంచి కొత్త టాక్స్ విధానం..!!
- కువైట్‌లో ఆహార భద్రత తనిఖీలు..!!
- యూఏఈలో ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు, సైనిక పరేడ్‌లతో సందడి..!!
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..







