పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం

- October 05, 2026 , by Maagulf
పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం

హైదరాబాద్: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించనున్న కార్యక్రమాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ గోషామహల్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం స్టేడియం ప్రాంగణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను డీజీపీ సమీక్షించారు. ఇందులో 48 గుర్రాల కోసం నిర్మిస్తున్న కొత్త హార్స్ స్టేబుల్ కాంప్లెక్స్, డాగ్ కెన్నెల్స్, ఐదు అంతస్తుల CAR భవనం, అలాగే క్రీడలు, గేమ్స్, అథ్లెటిక్స్‌కు సంబంధించిన సదుపాయాల పనులను పరిశీలించారు.

పలు పనులు నిర్ణీత షెడ్యూల్ కంటే గణనీయంగా ఆలస్యమవుతున్నట్లు గుర్తించిన డీజీపీ, సంబంధిత అధికారులను పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

పనులను వేగంగా చేపడుతున్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి గోషామహల్ స్టేడియం మొత్తం అభివృద్ధి పనులు పూర్తయి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటుందని డీజీపీ సీవీ ఆనంద్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com