కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- October 05, 2026
న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను బీజేపీ నేత కౌసర్ జహాన్ ప్రశంసించారు. ఆయన ప్రాణాలకు తెగించి పలువురి ప్రాణాలను కాపాడిన తీరును ప్రపంచవ్యాప్తంగా అభినందిస్తున్నారని పేర్కొన్నారు.
కౌసర్ జహాన్ మాట్లాడుతూ.. “భారత్ గర్వపడేలా చేసే ప్రతి సందర్భాన్ని మేము స్వాగతించి, అభినందిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో మాట్లాడారు. ఆయన చూపిన ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన తీరు అభినందనీయం” అని అన్నారు.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏమిటో తనకు అర్థం కావడం లేదని కౌసర్ జహాన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ “జాతి వ్యతిరేకుల పక్షాన నిలబడటానికే ప్రాధాన్యత ఇస్తుంది” అంటూ ఆమె విమర్శలు చేశారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇటీవల విమానంలో చోటుచేసుకున్న ఘటనలో చూపిన ధైర్యసాహసాలు ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో కౌసర్ జహాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..
- ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్..
- షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమికి విజయవంతంగా శస్త్రచికిత్స
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!







