ఐడియా, వొడాఫోన్ కలిసి ఒకే తాటిపైకి వచ్చేందుకు సిద్ధo...
- August 24, 2016
టెలికాం రంగంలో ఒక మహా అంకానికి బీజం పడేలా కనిపిస్తోంది. ప్రైవేట్ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఐడియా, వొడాఫోన్ కలిసి ఒకే తాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇండియాలో టెలికామ్ సేవలందిస్తున్న కంపెనీల్లో 3వ స్థానంలో ఉన్న ఐడియా, వొడాఫోన్‌తో కలిసి అడుగేయాలని పావులు కదుపుతోంది. రిలయన్స్ జియో ప్రకటిస్తున్న డేటా ఆఫర్ల వల్ల ఇతర టెలికామ్ సంస్థలు భారీగా నష్టపోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే నష్టనివారణ చర్యలకు కంపెనీలు సమాలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐడియా, వొడాఫోన్ కంపెనీలు విలీన బాట పట్టినట్లు సమాచారం. రెండు కంపెనీలను విలీనం చేసి... వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విలీన వార్తలను ఇరు కంపెనీల ఉన్నతాధికారులు పూర్తిగా తోసిపుచ్చారు. విలీనం జరుగుతున్నట్లు వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే అంతర్గతంగా మాత్రం చర్చలు జరుగుతున్నాయని బిజినెస్ ఛానెల్స్ కోడైకూస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!







