'సక్కనోడు..చిక్కినా అందమే ఫ్యామిలీ సబ్జెక్ట్..
- August 24, 2016
శ్రీలక్ష్మీ వెంకటరమణ మూవీస్ పతాకంపై శ్రీరామ్ దర్శకత్వంలో లీలా కార్తీక్, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్. రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సక్కనోడు..చిక్కినా అందమే'. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ..నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్ ఇది. మా నిర్మాతలు నేను చెప్పిన సబ్జెక్ట్‌ని నమ్మి, వెంటనే షూటింగ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కిషన్ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రయిల్ షూట్ చేయడం జరిగింది.మంచి అభినయం ప్రదర్శించగల నటీనటులు ఈ చిత్రానికి దొరకడం ఆనందంగా ఉంది.అన్నారు. నిర్మాత యు.ఎస్. రామచంద్రరావు మాట్లాడుతూ..దర్శకుడు శ్రీరామ్ మంచి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథని వినిపించారు. కథ ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే షూటింగ్ ప్రారంభించాము. శరవేగంగా చిత్రీకరణ జరిపి..అతి తక్కువ సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.అన్నారు.లీలా కార్తీక్, స్వప్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: బోడిరెడ్డి సాయికుమార్; సంగీతం: కిషన్ కవాడియా; కెమెరా: పి. వనిదర్ రెడ్డి; డ్యాన్స్: బి. రామారావు; ఎడిటింగ్: వి. నాగిరెడ్డి; ఆర్ట్: వెంకట్ ఆరె; కో-డైరెక్టర్: పురుషోత్తమ రెడ్డి వూటూరు; సహనిర్మాత: స్వప్నమంజరి మహంతి; నిర్మాత: యుఎస్. రామచంద్రరావు; దర్శకత్వం: శ్రీరామ్ బి.ఎస్.సి
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







